Telangana GHMC: గ్రేటర్ ఎన్నికలకు సర్కార్ సన్నద్ధం... ఏ క్షణమైనా
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:38 PM
జీహెచ్‌ఎంసీ విస్తరణ, వార్డుల డీలిమిటేషన్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. వార్డుల విభజనపై దాఖలైన 80కి పైగా పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 23: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను (జీహెచ్‌ఎంసీ) మూడు కార్పొరేషన్లుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 150 డివిజన్లతో ఒక కార్పొరేషన్ చేయడంతో పాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో మరో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బల్దియా పాలక మండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో గ్రేటర్ ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 10 తర్వాత ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జీహెచ్‌ఎంసీ విస్తరణ, వార్డుల డీలిమిటేషన్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. వార్డుల విభజనపై దాఖలైన 80కి పైగా పిటిషన్లను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టివేసింది. వార్డుల డీలిమిటేషన్‌పై జోక్యం చేసుకోమంటూ న్యాయస్థానం వాఖ్యానించింది. దీంతో డీలిమిటేషన్ ప్రక్రియకు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. ఇక జీహెచ్‌ఎంసీ విస్తరణ, వార్డుల డీలిమిటేషన్‌పై అధికారులకు 10 వేలకు పైగా అభ్యంతరాలు అందినట్లు సమాచారం.
అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు దాదాపు 40 వార్డుల పేర్ల మార్పు, 10 వార్డుల సరిహద్దులను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వార్డుల డీలిమిటేషన్‌పై రేపు (బుధవారం) ఫైనల్ నోటిఫికేషన్‌ను సర్కార్ ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు వార్డుల డీలిమిటేషన్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం, ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణ అంశాలు నగర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి...
వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు
Read Latest Telangana News And Telugu News