Share News

Municipal Elections: మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు.. త్వరలోనే షెడ్యూల్ విడుదల..

ABN , Publish Date - Jan 17 , 2026 | 03:00 PM

తెలంగాణలో 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ రోజు సాయంత్రానికి మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది..

Municipal Elections: మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు.. త్వరలోనే షెడ్యూల్ విడుదల..
Municipal Elections

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియలో (Municipal Elections) కీలక ముందడుగు పడింది. 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈరోజు (శనివారం) సాయంత్రానికి మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (SEC) రిజర్వేషన్ల జాబితా అందజేసే అవకాశం ఉంది. ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధంగా ఉంది. ఒకటి, రెండు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 10 కార్పొరేషన్లలో ఎస్సీ-1, ఎస్టీ-1, బీసీ-3(ఒకటి మహిళ)లకు కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఐదు స్థానాలకు గానూ ఏకంగా నాలుగు స్థానాలను మహిళలకు కేటాయించారు. 121 మున్సిపాలిటీల్లో ఎస్సీ-17, ఎస్టీ-5, బీసీ-38, జనరల్-61‌ కేటాయించడం జరిగింది.


కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లు...

  • కొత్తగూడెం కార్పొరేషన్‌ - ఎస్టీ (జనరల్)

  • రామగుండం కార్పొరేషన్‌- ఎస్సీ (జనరల్)

  • మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌- బీసీ మహిళ

  • మంచిర్యాల కార్పొరేషన్‌- బీసీ (జనరల్)

  • కరీంనగర్ కార్పొరేషన్‌ - బీసీ (జనరల్)

  • ఖమ్మం కార్పొరేషన్‌- మహిళ (జనరల్)

  • నిజామాబాద్ కార్పొరేషన్‌- మహిళ (జనరల్)

  • వరంగల్ కార్పొరేషన్‌- జనరల్

  • జీహెచ్‌ఎంసీ - మహిళ (జనరల్)

  • నల్లగొండ కార్పొరేషన్‌- మహిళ (జనరల్)




ఇవి కూడా చదవండి...

త్వరలో మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల్సిందే: రాంచందర్ రావు

భారీ శబ్ధంతో పేలిన వాషింగ్‌ మెషిన్.. హైదరాబాద్‌లో కలకలం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 17 , 2026 | 04:33 PM