Share News

Washing Machine Explosion: భారీ శబ్దంతో పేలిన వాషింగ్‌ మెషిన్.. హైదరాబాద్‌లో కలకలం

ABN , Publish Date - Jan 17 , 2026 | 01:55 PM

హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో భారీ శబ్దంతో వాషింగ్ మెషిన్ పేలింది. రన్నింగ్‌లో ఉండగానే పేలిపోవడంతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Washing Machine Explosion: భారీ శబ్దంతో పేలిన వాషింగ్‌ మెషిన్.. హైదరాబాద్‌లో కలకలం
Washing Machine Explosion

హైదరాబాద్, జనవరి 17: నగరంలో మరోసారి వాషింగ్ మెషిన్ పేలుడు(Washing Machine Explosion) ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల.. అమీర్‌పేటలోని ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ పేలిన ఘటన మరువక ముందే కృష్ణానగర్‌లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో‌ని ఓ ఇంట్లో రన్నింగ్‌లో ఉన్న వాషింగ్ మెషిన్ ఒక్కసారిగా పేలింది. బట్టలు ఉతకేందుకు.. మెషిన్ ఆన్ చేసి ఉంచగా.. అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. రన్నింగ్‌లో ఉండగానే భారీ శబ్దంతో పేలిపోయింది.


పేలుడు ధాటికి ఆ వాషింగ్ మిషన్ ముక్కలు ముక్కలైంది. అయితే.. ఘటనా సమయంలో వాషింగ్ మెషిన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడు ప్రభావంతో ఇంట్లోని వస్తువులు దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా వాషింగ్ మెషిన్ పేలడంతో ఇంట్లోని వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.


కాగా.. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో తరుచుగా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గత నవంబర్‌లోనూ అమీర్‌పేట్‌లోని ఒక ఇంటి బాల్కనీలో వాషింగ్ మెషిన్ రన్నింగ్‌లో ఉండగా భారీ శబ్దంతో పేలి తునాతునకలైంది. ఆ ఘటనలోనూ ఎవరూ మెషిన్ దగ్గర లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అలాగే.. డిసెంబర్ 2025లో ఎస్‌ఆర్ నగర్ పరిధిలో వాషింగ్ మెషిన్ పేలిన ఘటనలో కంపెనీపై కేసు నమోదైంది. ఇలా తరచుగా వాషింగ్ మెషిన్‌లు పేలుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి.


ఇవి కూడా చదవండి...

పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరు టీచర్లు మృతి

త్వరలో మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల్సిందే: రాంచందర్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 17 , 2026 | 03:11 PM