Hyderabad Hit And Run: సైదాబాద్‌లో యువకుణ్ని ఢీకొట్టి 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:24 PM
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓ యువకుడిని ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత సుమారు వంద మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.
హైదరాబాద్, జనవరి 17: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాపేట్‌లో హిట్ అండ్ రన్(Hyderabad Hit And Run) ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న సునీల్ కుమార్ అనే యువకుడిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. బలంగా ఢీకొట్టింది. అనంతరం ఆ కారు.. యువకుణ్ని సుమారు 50 నుంచి 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో సునీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి.. చికిత్స నిమిత్తం ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం.. సునీల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. అయితే.. ప్రమాదానికి కారణమైన కారుతో సహా డ్రైవర్ పరారవగా.. అతడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరు టీచర్లు మృతి
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్
Read Latest Telangana News And Telugu News