మున్సిపల్ జోష్.. రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్..!
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:08 PM
తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పనుంది. రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు సర్కార్ సన్నద్ధమైంది..
హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) త్వరలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి.. రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎకరానికి రూ.6,000 చొప్పున అర్హులైన రైతులకు ఈ సాయాన్ని అందించనున్నారు. ఇందుకు ఫిబ్రవరి 17 తేదీని ముహూర్తంగా డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈరోజు (శనివారం) సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలతో పాటు స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు: కేటీఆర్
ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ
Read Latest Telangana News And Telugu News