Share News

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు

ABN , Publish Date - Oct 28 , 2026 | 07:04 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయంతీసుకుంది. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మండల స్థాయి సమన్వయ కమిటీలను నియమించింది. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మండల సమన్వయ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు
Telangana Government

హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మండల స్థాయి సమన్వయ కమిటీలను నియమించింది. రాష్ట్రంలో ఈ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మండల సమన్వయ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ -579ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసింది.


గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పన, తాగునీటి భద్రత, పశుగ్రాసం అందుబాటుపై కమిటీలు ప్రత్యేక దృష్టిసారించనున్నాయి. 35,959 చిన్న నీటిపారుదల చెరువుల పరిధిలో పశుగ్రాసం సాగుకు అనువైన ప్రాంతాలను ఈ కమిటీలు గుర్తించనుంది. మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో పశుగ్రాసం సాగును ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనుంది. పశువులకు తాగునీటి కోసం కొత్త నీటి తొట్టెల నిర్మాణం, ఇప్పటికే ఉన్న తొట్టెల మరమ్మతులను చేయనుంది. వ్యవసాయ కుంటలు, చెక్‌డ్యామ్‌లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాల ద్వారా నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది.


గ్రామీణ రహదారులు, కల్వర్టులు, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, పశువుల షెడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది. ప్రతి గ్రామపంచాయతీలో అవసరమైన పనులను గుర్తించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను రూపకల్పన చేయనుంది. మండల సమన్వయ కమిటీలు వారానికి కనీసం ఒకసారి సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించనుంది. వారంతపు నివేదికలను జిల్లా కలెక్టర్లకు సమర్పించాలని ఆదేశించనుంది. ఆయా కమిటీల ఏర్పాటు, పనుల అమలుపై పర్యవేక్షణ బాధ్యత జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు పెట్టుబడులపై ఫోకస్.. గ్లోబల్ సమ్మిట్‌తో రేవంత్ సర్కార్ భారీ ప్లాన్!

హైదరాబాద్‌కు సింగూర్‌ జలాల తరలింపు ఆపకపోతే బరాబర్ అడ్డుకుంటాం.. రఘునందన్ వార్నింగ్

ఎల్‌నినో ప్రభావంతో అన్ని ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం: మంత్రి పొంగులేటి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 08:27 PM