ఎల్‌నినో ప్రభావంతో అన్ని ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:58 PM
ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో అన్ని ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులు చాలా అనుభవజ్ఞులని..ఈ కరువుపై దృష్టి పెట్టి రెండో పంటను వేయొద్దని కోరారు.
సంగారెడ్డి జిల్లా, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో అన్ని ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Telangana Minister Ponguleti Srinivasa Reddy) వ్యాఖ్యానించారు. రైతులు చాలా అనుభవజ్ఞులని.. ఈ కరువుపై దృష్టి పెట్టి రెండో పంటను వేయొద్దని కోరారు. ప్రతిపక్షాలు కూడా ఉన్న వాస్తవాన్ని అన్నదాతలకు చెబితే బాగుంటుందని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) సంగారెడ్డిలో మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలోని జడ్పీ హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎంపీ రఘునందన్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూ భారతిని తీసుకువచ్చామని వెల్లడించారు.
900 గ్రామాల్లో భూ సర్వే..
125 ఏళ్ల క్రితం పూర్తి భూ సర్వే జరిగితే... మళ్లీ ఇప్పుడు భూముల రీ సర్వే చేస్తున్నామని మంత్రి పొంగులేటి వివరించారు. 380 గ్రామాల్లో ఇప్పటివరకు పూర్తిగా భూ సర్వే పూర్తి అయిందని తెలిపారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో వారికి భూమి హక్కు పత్రాలు ఇచ్చామని స్పష్టం చేశారు. 900 గ్రామాల్లో భూ సర్వే చివరి దశకు వచ్చిందని ప్రస్తావించారు. ఏడాదిన్నరలోపు తెలంగాణలో ఈ భూ సర్వే పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. వివాదరహితమైన భూములను రాబోయే తరానికి అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆధార్ ఎలా ఉందో భూదార్ అలా ఉండబోతుందని చెప్పారు.
కేంద్రం నుంచి నిధులు రావడం ఆలస్యం..
గ్రామీణ ప్రాంతాల్లో కట్టుకునే ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యమైందని మంత్రి పొంగులేటి అన్నారు. తాజాగా కేంద్రం 2 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు బొమ్మలకు మాత్రమే పరిమితం అయ్యాయని విమర్శించారు. తమది ప్రజాప్రభుత్వమని.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి రక్షణ ఉంటుందని వ్యాఖ్యానించారు. రేపు (బుధవారం) అఖిలపక్ష సమావేశం జరగుతుందని వెల్లడించారు. అఖిలపక్షంతో కలిసి కేంద్ర ప్రభుత్వ పెద్దలను త్వరలోనే కలుస్తామని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ప్రతిపక్షాలను తీసుకుని ఢిల్లీకి వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సీఎం సాకుకూలం.!
విశాంత్ర ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో రెండు టీమ్‌ల హస్తం.. సజ్జనార్ ఏమన్నారంటే..
హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News