Share News

తెలంగాణకు పెట్టుబడులపై ఫోకస్.. గ్లోబల్ సమ్మిట్‌తో రేవంత్ సర్కార్ భారీ ప్లాన్!

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:18 PM

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ -2026ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది.

తెలంగాణకు పెట్టుబడులపై ఫోకస్.. గ్లోబల్ సమ్మిట్‌తో రేవంత్ సర్కార్ భారీ ప్లాన్!
Telangana Global Investment Summit

హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ -2026ను (Telangana Global Investment Summit) తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందులో భాగంగానే ఈ సమ్మిట్‌‌కు భారీ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఈ సమ్మిట్‌కు 550కు పైగా దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ఆహ్వానాలను అందించారు. అక్టోబరు 29వ తేదీన న్యూఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. వివిధ దేశాల రాయబారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌‌కు ఆహ్వానించనున్నారు.


తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్‌ను రేవంత్ సర్కార్ నిర్వహించనుంది. ప్రధాన సమ్మిట్‌కు 1,500కు పైగా కంపెనీలు, సంస్థల ప్రతినిధులకు ఆహ్వానాలను అందించనున్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ రోడ్‌షోలు నిర్వహించిన విషయం తెలిసిందే. రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షా ఎక్స్‌పోలో పాల్గొనేందుకు వందకు పైగా కంపెనీలు, సంస్థలకు ఆహ్వానాలను అందించనున్నారు. ఫ్యూచర్ సిటీలో 25 సెక్టార్లుగా ప్రధాన సమ్మిట్ వేదికను విభజించారు.


ప్లీనరీలు, సెమినార్లు, చర్చలు, ఒప్పందాల కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రతినిధుల కోసం రవాణా, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ప్రతినిధికి సమన్వయ బాధ్యతల కోసం సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించనున్నారు. ఈ ఏర్పాట్లన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు. యువతకు విస్తృత ఉపాధి అవకాశాల కల్పనే ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యమని సీఎస్ సంజయ్ జాజు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సీఎం సాకుకూలం.!

విశాంత్ర ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో రెండు టీమ్‌ల హస్తం.. సజ్జనార్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 05:40 PM