హైదరాబాద్‌కు సింగూర్ జలాల తరలింపు ఆపకపోతే బరాబర్ అడ్డుకుంటాం.. రఘునందన్ వార్నింగ్
ABN , Publish Date - Oct 27 , 2026 | 08:20 PM
హైదరాబాద్‌కు సింగూరు జలాల తరలింపును నిలిపివేయాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రులకు వివరించామని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు సింగూరు జలాల తరలింపును నిలిపివేయాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రులకు వివరించామని పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఈరోజు (మంగళవారం) మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌కు నీటి సరఫరాకు గండిపేట, హిమాయత్ సాగర్, నాగార్జున సాగర్, ఎల్లంపల్లి ఉన్నాయని.. కానీ మూడు టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉన్న సింగూర్ నుంచి హైదరాబాద్‌కు నీరు ఇవ్వడం సరికాదని అన్నారు. 25 టీఎంసీలు ఉన్న సింగూర్‌ను మరమ్మతుల పేరుతో మూడు టీఎంసీలకు ప్రభుత్వం తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
డెడ్ స్టోరేజీ పోగా రెండు టీఎంసీలు మాత్రమే ప్రస్తుతం సింగూర్‌లో ఉన్నాయని రఘునందన్ రావు ప్రస్తావించారు. సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి జిల్లాల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు సింగూర్ నీటి సరఫరాను నిలిపివేయాలని కోరారు. మరో రెండు నెలల్లో సింగూరు డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంటే పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీరు కంపెనీలకు నీటిని నిరంతరంగా సరఫరా చేస్తూ ఐఐటీ, బీడీఎల్, ఓడీఎఫ్‌లకు సగం కోత విధించడం సరికాదని అన్నారు.
ఎల్‌నినో విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని రఘునందన్ రావు ధ్వజమెత్తారు. ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నల వర్షం కురిపించారు. సింగూర్‌కు జలాల తరలింపు ఆపకపోతే తామే బరాబర్ అడ్డుకుంటామని హెచ్చరించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి..? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులిస్తే వాటి వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యూఎల్‌సీ ఎందుకు ఇవ్వట్లేదని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సీఎం సాకుకూలం.!
విశాంత్ర ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో రెండు టీమ్‌ల హస్తం.. సజ్జనార్ ఏమన్నారంటే..
హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News