Share News

మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు పడనుందా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 29 , 2026 | 07:51 AM

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భువీ పేలవ ప్రదర్శన చేశాడు.

మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు పడనుందా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..
Bhuvneshwar Kumar

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భువీ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో నాలుగో టీ20లో అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మూడు టీ20ల్లోనూ భారత్ విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది (Ashwin about Bhuvneshwar Kumar).


ఈ మూడు మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఓవరుకు సగటున 11.58 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ గణాంకాల నేపథ్యంలో జట్టు యాజమాన్యం తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందని అశ్విన్ పేర్కొన్నాడు. భువనేశ్వర్ స్థానంలో మయాంక్ యాదవ్ లేదా స్పిన్నర్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని అభిప్రాయపడ్డాడు. 'భువీ బౌలింగ్ చేసిన విధానాన్ని చూస్తే అతడి స్థానంలో ఒక స్పిన్నర్ లేదా మయాంక్ యాదవ్‌ను తీసుకున్నా నేను ఆశ్చర్యపోను. సిరీస్ ఇప్పటికే భారత్ సొంతమైంది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఇతర ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం మంచిది' అని అశ్విన్ పేర్కొన్నాడు (India vs New Zealand T20I 2026).


'తొలి రెండు మ్యాచ్‌లు పెద్ద మైదానాల్లో జరిగాయి. అక్కడ స్పిన్నర్లను ఉపయోగించుకునే అవకాశం ఉండేది (India playing XI). అయితే మూడో టీ20లో న్యూజిలాండ్ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపలేకపోయారు. మిగిలిన రెండు మ్యాచ్‌లు ఇంకా చిన్న మైదానాల్లో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవడం అంత సులభం కాకపోవచ్చు. జట్టు యాజమాన్యం ప్రత్యర్థి బ్యాటింగ్, మైదాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది' అని అశ్విన్ చెప్పాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్

పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

Updated Date - Oct 29 , 2026 | 07:57 AM