కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:40 PM
కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో ఆయన సోషల్ మీడియా యాప్ ఎక్స్ వేదికగా సెటైర్ వేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ నాలుగు రాష్ట్రాల శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో ఆయన సోషల్ మీడియా యాప్ ఎక్స్ వేదికగా సెటైర్ వేశారు. ‘బ్యాలెట్ పేపర్‌తో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నిసీట్లు గెలిచింది..?’ అంటూ ప్రధాని చురకలంటించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎమ్) ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్లతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని గత కొంతకాలంగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బ్యాలెట్ పేపర్‌తో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నిసీట్లు సాధించిందంటూ మోదీ ఎద్దేవా చేశారు.
కాగా ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 28 శాసన మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఒక్కస్థానాన్ని కూడా గెలవలేకపోయింది. అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఒక్క సీటు కూడా పొందలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీపై ప్రధాని మోదీ సెటైర్ వేశారు.