పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:38 PM
పంజాబ్‌లో తాజాగా కాల్పుల కలకలం రేగింది. కారులో వెళుతున్న వారిపై ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా కాల్పులకు దిగడంతో ఒకరు మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లో తాజాగా కాల్పుల కలకలం రేగింది. కారులో వెళుతున్న వారిపై ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా కాల్పులకు దిగడంతో ఒకరు మృతి చెందారు. తార్న్ తరణ్ జిల్లాలోని అసల్ ఉత్తర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గురుసేవక్ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడ్డ హర్‌కిరత్ సింగ్, సాజన్ సింగ్‌లకు భికీవింద్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, థార్ ఎస్‌యూవీలో వచ్చిన ఇద్దరు నిందితులు వాహనం దిగి మరోకారులోని వారిపై కాల్పులు జరిపారు. నిందితుల్లో ఒకరిని మంజీత్ సింగ్ అలియాస్ కట్టాగా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. రెండో నిందితుడి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. పట్టపగలు వీధిలో అందరూ చూస్తుండగా ఈ ఘటన జరగడంతో స్థానికంగా కలకలం రేగింది.
నిందితులు ఎందుకు కాల్పులకు తెగ బడిందీ ఇంకా తెలియరాలేదు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల పరిస్థితి గురించి కూడా తెలియాల్సి ఉంది. ఇటీవల ముంబైలో బాలీవుడు నటుడు టైగర్ ష్రాఫ్‌పై బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్పులకు దిగడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
తిరుచ్చి ఎయిర్‌పోర్టులో వన్యప్రాణుల రవాణా ప్రయత్నం భగ్నం
సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నిరంతరం దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం..