సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నిరంతరం దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం..
ABN , Publish Date - Oct 28 , 2026 | 04:50 PM
ఢిల్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పులు, వివరాల మార్పులకు సంబంధించిన దరఖాస్తులను నిరంతరం స్వీకరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, కేవలం దరఖాస్తు పత్రం సమర్పించలేదనే కారణంతో ఓటర్ల పేర్ల తొలగింపు సరికాదని పేర్కొంది (Delhi SIR).
ఫారం-6, ఫారం-8 దరఖాస్తులకు కఠిన గడువులు పెట్టొద్దని, ఎప్పుడైనా స్వీకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహానగరాల్లో నివసించే వలస కార్మికులు, కూలీల జీవన విధానాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి నిర్దిష్ట గడువుల్లో పత్రాలు సమర్పించడం కష్టమయ్యే అవకాశముందని, ఇలాంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేసింది (Supreme Court SIR order).
'లాజికల్ డిస్క్రిపెన్సీ' కేటగిరీ చట్టబద్ధతను భవిష్యత్తులో పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది (voter list revision). ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయనే కారణంతో తీసుకునే చర్యలు న్యాయపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ, అర్హులైన పౌరులు ఓటర్ల జాబితాలో చోటు పొందేందుకు తగిన అవకాశాలు కల్పించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ వార్తలూ చదవండి
ఆర్నబ్ తుఫాన్ నష్టంపై అమిత్ షాకు ఫోన్‌లో వివరించిన చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందాలను పంపండి.. అమిత్ షా