తిరుచ్చి ఎయిర్‌పోర్టులో వన్యప్రాణుల రవాణా ప్రయత్నం భగ్నం
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:23 PM
తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణుల అక్రమ రవాణా యత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణుల అక్రమ రవాణా యత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. 45 సజీవ సరీసృపాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్యాసింజర్లు బ్యాంకాక్ నుంచి కొలంబో మీదుగా భారత్‌లోకి ఫుడ్ బాక్సుల్లో వాటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించినట్టు గుర్తించారు.
నిఘా సమాచారం అందడటంతో వెంటనే రంగంలోకి దిగి నిందితుల బ్యాగులను చెక్ చేయగా విషయం బయటపడింది. మత్తు మందు ఇచ్చి అడవి జంతువులను తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి 23 కార్న్ స్నేక్స్, 16 బాల్ పైథాన్ పాములు, ఒక వైట్ స్నో ఇగ్వానా (బల్లిలాంటిది) స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం-1962 కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జంతువులను ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు (ఏఐయూ) అప్పగించారు. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోసాయంతో జంతువులను వాటి సహజ నివాస ప్రాంతాల్లో ప్రవేశపెడతారని నిపుణులు చెబుతున్నారు.
కస్టమ్స్ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విభాగం స్మగ్లింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అటవీ జంతువుల అక్రమ రవాణాతో పాటు బంగారం, ఫేక్ కరెన్సీ, ఆయుధాలు, డైమండ్స్ వంటివి అక్రమంగా దేశంలోకి చొరబడకుండా గట్టి నిఘా పెడుతుంది. ఇంటర్‌పోల్, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి స్మగ్లింగ్ నిరోధానికి డీఆర్ఐ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
ఈ వార్తలనూ చదవండి:
సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నిరంతరం దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం..
ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు