Share News

హార్దిక్ కోసం 5 ఐపీఎల్ జట్లు.. కెప్టెన్సీపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:48 AM

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి మరో ఫ్రాంచైజీకి వెళ్లే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఐదు జట్లు అతడిపై ఆసక్తి చూపుతున్నాయని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు.

హార్దిక్ కోసం 5 ఐపీఎల్ జట్లు.. కెప్టెన్సీపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు..
Hardik Pandya

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి మరో ఫ్రాంచైజీకి వెళ్లే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఐదు జట్లు అతడిపై ఆసక్తి చూపుతున్నాయని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) హార్దిక్‌కు సరైన జట్టు కావచ్చని, అక్కడ అతడికి కెప్టెన్సీ చేసే అవకాశం కూడా దక్కవచ్చని అభిప్రాయపడ్డాడు (Ashwin about Hardik Pandya).


'హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ఆసక్తి చూపుతున్నాయి. అయితే నా అభిప్రాయం ప్రకారం హార్దిక్‌కు కేకేఆర్ సరైన జట్టు కావచ్చు. ఆ జట్టుతో చేరితే నాయకత్వ బాధ్యత కూడా వచ్చే అవకాశముంది. హార్దిక్‌ను తీసుకునే క్రమంలో కేకేఆర్ హర్షిత్ రాణా లేదా రింకూ సింగ్ వంటి ఆటగాళ్లను ట్రేడ్‌లో భాగంగా ముంబైకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే హార్దిక్ తదుపరి జట్టును ఎంచుకునేటప్పుడు కెప్టెన్సీ ఒక్కటే ప్రధాన షరతు కాకపోవచ్చు' అని అశ్విన్ పేర్కొన్నాడు (Hardik Pandya trade).


'హార్దిక్ గతంలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు (Hardik IPL captaincy). ఆ జట్టు నుంచి ముంబై ఇండియన్స్‌కు మారాడు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ మళ్లీ ట్రేడ్ చర్చల్లోకి వస్తే, రషీద్ ఖాన్‌ను హార్దిక్‌కు బదులుగా ఇచ్చే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో హార్దిక్‌కు బదులుగా రషీద్ ఖాన్‌ను తీసుకోవడం ముంబై జట్టుకు మంచి ఆప్షన్' అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి..

మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు పడనుందా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..


పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 29 , 2026 | 11:52 AM