Share News

న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. భారత్‌తో చివరి రెండు టీ20లకు స్టార్ బౌలర్లు దూరం..

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:30 PM

భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కివీస్ జట్టు మిగిలిన రెండింట్లో అయినా గెలవాలని కృత నిశ్చయంతో ఉంది.

న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. భారత్‌తో చివరి రెండు టీ20లకు స్టార్ బౌలర్లు దూరం..
New Zealand cricket team

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కివీస్ జట్టు మిగిలిన రెండింట్లో అయినా గెలవాలని కృత నిశ్చయంతో ఉంది. అయితే ఆ రెండు మ్యాచ్‌లకు ఇద్దరు స్టార్ బౌలర్లు అందుబాటులో లేకపోవడం కివీస్‌ గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశముంది (New Zealand vs India T20I 2026).


లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ గాయాల కారణంగా మిగిలిన రెండు టీ20లకు దూరమయ్యారు. వీరి స్థానంలో పేసర్ మాట్ ఫిషర్‌ను జట్టులోకి తీసుకున్నారు. లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఫెర్గూసన్ కాలికి, హెన్రీ కుడి తొడకు గాయాలయ్యాయి. వీరిద్దరూ పూర్తిగా కోలుకోవడానికి ఒకటి నుంచి రెండు వారాల సమయం పట్టవచ్చని వైద్యులు అంచనా వేశారు (NZ injury news).


వన్డే సిరీస్ నాటికి వీరిద్దరూ కోలుకుంటారని న్యూజిలాండ్ యాజమాన్యం ఆశిస్తోంది (India T20 series). ఫెర్గూసన్ స్థానంలో మాట్ ఫిషర్‌ను మిగిలిన టీ20లకు ఎంపిక చేశారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లను గెలిచిన భారత్ 3-0తో ఆధిక్యంలో ఉంది. నాలుగో టీ20 అక్టోబర్ 30న, ఐదో మ్యాచ్ నవంబర్ 1న జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 4 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.


ఇవి కూడా చదవండి..

మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు పడనుందా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..


పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 29 , 2026 | 12:36 PM