టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!
ABN , Publish Date - Oct 30 , 2026 | 03:27 PM
అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో రషీద్ ఈ ఘనతను అందుకున్నాడు. జింబాబ్వే బ్యాటర్ మారుమణిని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడంతో రషీద్ ఖాతాలో 200వ వికెట్ చేరింది.
120 మ్యాచుల్లోనే రషీద్ ఖాన్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. 2025 సెప్టెంబర్‌లో న్యూజిలాండ్ మాజీ బౌలర్ టిమ్ సౌథీని అధిగమించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఏడాది కాలంగా రషీద్ ఖాన్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా ఇదే..
రషీద్ ఖాన్ (ఆఫ్గానిస్థాన్) – 120 మ్యాచ్‌లు, 200 వికెట్లు
ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) – 153 మ్యాచ్‌లు, 171 వికెట్లు
ఎహ్సాన్ ఖాన్ (హాంకాంగ్) – 119 మ్యాచ్‌లు, 165 వికెట్లు
ఇష్ సోధి (న్యూజిలాండ్) – 142 మ్యాచ్‌లు, 165 వికెట్లు
టిమ్ సౌథీ (న్యూజిలాండ్) – 126 మ్యాచ్‌లు, 164 వికెట్లు
ఇవి కూడా చదవండి:
హాంకాంగ్ సిక్సెస్: భారత్ చిత్తు.. పాకిస్థాన్ ఘన విజయం
కాలుష్య రహిత దీపావళి.. కోహ్లీతో ప్రచారం చేయించండి: సుప్రీంకోర్టు