Share News

అండర్‌-19 ఆసియాక్‌పలో ఆర్యవీర్‌, అన్వయ్‌

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:23 AM

మాజీ ఆటగాళ్లు రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ల తనయులు అన్వయ్‌, ఆర్యవీర్‌ అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీలో ఆడనున్నారు.

అండర్‌-19 ఆసియాక్‌పలో ఆర్యవీర్‌, అన్వయ్‌
Anvay Dravid, Aryaveer Sehwag

న్యూఢిల్లీ: మాజీ ఆటగాళ్లు రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ల తనయులు అన్వయ్‌, ఆర్యవీర్‌ అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీలో ఆడనున్నారు. వచ్చే నెల 5 నుంచి 14 వరకు మస్కట్‌లో జరిగే ఈ టోర్నీ కోసం శుక్ర వారం జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ బృందానికి లక్ష్య రాయ్‌చందానీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌, పాక్‌, యూఏఈ, నేపాల్‌ ఉండగా.. గ్రూప్‌ ‘బి’లో బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌, మలేసియా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!

కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!

Updated Date - Oct 31 , 2026 | 02:23 AM