భారత్ ‘ఎ’ జట్టులో సిరాజ్
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:26 AM
న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే రెండో అనధికార టెస్టులో పేసర్ మహ్మద్ సిరాజ్ భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు.
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే రెండో అనధికార టెస్టులో పేసర్ మహ్మద్ సిరాజ్ భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. శనివారం ఆరంభమయ్యే ఈ మ్యాచ్ ద్వారా తనకు మ్యాచ్ ప్రాక్టీస్ లభించే అవకాశం ఉంది. ఈ హైదరాబాదీ రాకతో పేస్ విభాగం మరింత బలోపేతం కానుంది. ఇతర పేసర్లు నబీ, అన్షుల్, ఆకాశ్ సత్తా చూపిస్తున్నారు. బ్యాటింగ్‌లో దేవ్‌దత్ పడిక్కళ్ సూపర్ ఫామ్‌తో అండగా నిలువనున్నాడు. తొలి టెస్టులో భారత్ గెలిచే అవకాశం ఉన్నా వెలుతురులేమితో ఆట ముందుగానే ముగిసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!
కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!