Share News

అభిషేక్, ఇషాన్, వైభవ్‌లను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిందే: యువరాజ్ సింగ్

ABN , Publish Date - Oct 31 , 2026 | 07:17 AM

భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ బీసీసీఐ సెలెక్టర్లకు కీలక సూచన చేశాడు. యువ ప్లేయర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీలను వన్డే జట్టులోకి తీసుకోవాలని కోరాడు.

అభిషేక్, ఇషాన్, వైభవ్‌లను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిందే: యువరాజ్ సింగ్
Yuvraj Singh

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ ప్లేయర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ.. టీ20ల్లో అదరగొడుతున్నారు. అయితే వీరికి వన్డే జట్టులో మాత్రం అవకాశాలు రావడం లేదు. ఇషాన్ కిషన్‌కు వన్డే క్రికెట్ ఆడిన అనుభవం ఉంది కానీ.. అభిషేక్, వైభవ్‌లు ఆ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయలేదు. ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ ముగ్గురికి వన్డే జట్టులో అవకాశం కల్పించాలని బీసీసీఐ సెలెక్టర్లకు సూచించాడు.


‘అభిషేక్ శర్మను వన్డే ఫార్మాట్‌లో ఆడితే చూడాలని నేను కోరుకుంటున్నా. ఇషాన్ కిషన్, అభిషేక్, వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్లను 50 ఓవర్ల క్రికెట్‌లో ఎంపిక చేయకపోతే, ఎక్కడో ఒకచోట వారి ప్రతిభకు అన్యాయం చేసినట్లే అవుతుంది. సీనియర్ క్రికెటర్ల ఉండటం వల్ల యువ ప్లేయర్లకు అవకాశం కల్పించడం కష్టమే. కానీ యువ బ్యాటర్లు ప్రదర్శిస్తున్న ఆటతీరు చూస్తుంటే త్వరలోనే వారికి జట్టులో అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నా. అభిషేక్ సాధించిన విజయాల వెనుక అతడి కష్టమే ఉంది. ఆ క్రెడిట్ మొత్తం అతడికే దక్కుతుంది’ అని యువీ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!

కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!

Updated Date - Oct 31 , 2026 | 07:50 AM