టీమ్ ఓడినా.. అర్ష్‌దీప్ సింగ్ ఖాతాలో ప్రపంచ రికార్డులు
ABN , Publish Date - Oct 30 , 2026 | 07:57 PM
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టీ20లో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పేరిట ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టిన అతడు.. 150 వికెట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టీ20లో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పేరిట ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసిన అతడు..150 వికెట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. నాలుగో టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ 87 వరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే టీమ్ ఓడినా అర్ష్‌దీప్ సింగ్ వ్యక్తిగతంగా మెరుగ్గా రాణించాడు. ఓవర్‌కు 10 కంటే తక్కువ పరుగులిచ్చి న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వికెట్ తీశాడు.
అర్ష్‌దీప్ సింగ్ నెలకొల్పిన రికార్డులు ఏవంటే..?
అర్ష్‌దీప్ సింగ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా, ప్రపంచంలో తొమ్మిదో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
అర్ష్‌దీప్ సింగ్ 103 మ్యాచుల్లో 150 వికెట్లు పడగొట్టాడు. అందుకోసం అతడు 2,143 బంతులు విసిరాడు.
అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్‌లోకి చేరిన పేసర్‌గా అర్ష్‌దీప్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్(2,532 బంతులు)ను అధిగమించాడు. ఓవరాల్‌గా స్పిన్నర్ వనిందు హసరంగ(2,035 బంతులు) అగ్రస్థానంలో ఉన్నాడు.
అరంగేట్రం చేసిన తర్వాత అతి తక్కువ రోజుల్లోనే(1577 రోజులు) 150 వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో హసరంగ(2,325 రోజులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 అంతర్జాతీయ వికెట్లు తీసిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు అతడు 40 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ 2022లో సాధించిన 39 వికెట్ల రికార్డును అధిగమించాడు.
ఇవి కూడా చదవండి:
టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!
కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!