Share News

నాలుగో టీ20: తడబడ్డ భారత బ్యాటర్లు.. న్యూజిలాండ్ ఘన విజయం

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:34 PM

ఆక్లాండ్ వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. 260 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ పూర్తిగా విఫలమైంది.

నాలుగో టీ20: తడబడ్డ భారత బ్యాటర్లు.. న్యూజిలాండ్ ఘన విజయం
India vs New Zealand 4th T20

ఇంటర్నెట్ డెస్క్: ఆక్లాండ్ వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. 260 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ పూర్తిగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో కివీస్ గెలుపు ఖాతా తెరిచింది. 3-1 తేడాతో నిలిచి.. సిరీస్‌ను భారత్‌ క్లీన్ స్వీప్ చేయకుండా అడ్డుకుంది.


భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(35) టాప్ స్కోరర్. సంజు శాంసన్(4), అభిషేక్ శర్మ(27), ఇషాన్ కిషన్(0), శ్రేయస్ అయ్యర్(22), అక్షర్ పటేల్(7), నితీశ్ కుమార్ రెడ్డి(21), నమన్ ధీర్(28), అర్ష్‌దీప్ సింగ్(0) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ప్రిన్స్ యాదవ్(18*), మయాంక్ యాదవ్(3*) నాటౌట్‌గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ 4, ఫిషర్, శాంట్నర్ చెరో 2, మిల్నే ఒక వికెట్ పడగొట్టారు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 259 పరుగులు సాధించింది. గ్లెన్ ఫిలిప్స్(107; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. మరో బ్యాటర్ బ్రేస్‌వెల్(65; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ తలొక వికెట్ పడగొట్టారు. కాగా ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ హామిల్టన్ వేదికగా ఆదివారం జరగనుంది.


ఇవి కూడా చదవండి:

టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!

కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!

Updated Date - Oct 30 , 2026 | 05:00 PM