అండర్ 19 ఆసియా కప్: భారత జట్టు ప్రకటన.. ద్రవిడ్, సెహ్వాగ్ కుమారులకు చోటు
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:57 PM
నవంబర్ 5 నుంచి ఒమన్ వేదికగా అండర్ 19 ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 5 నుంచి ఒమన్ వేదికగా అండర్ 19 ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఇందులో భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు అన్వయ్ ద్రవిడ్, ఆర్యవీర్ సెహ్వాగ్ చోటు దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన దేశవాళీ టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీలో ఈ ఇద్దరు యువ క్రికెటర్లు శతకాలతో చెలరేగారు. దీంతో వీరికి సెలక్టర్లు అవకాశం కల్పించారు.
భారత్-పాక్ పోరు ఎప్పుడంటే?
అండర్-19 ఆసియా కప్‌లో భారత్ గ్రూప్-ఎలో ఉంది. ఈ గ్రూప్‌లో పాకిస్థాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత జట్టు నవంబర్ 6న నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 8న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. నవంబర్ 10న యూఏఈతో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గానిస్థాన్, మలేసియా జట్లు ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. నవంబర్ 12న సెమీఫైనల్స్, నవంబర్ 14న ఫైనల్ నిర్వహించనున్నారు.
అండర్ 19 భారత జట్టు ఇదే:
లక్ష్య రైచందానీ (కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, వి.కె. వినీత్, యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ (వైస్ కెప్టెన్), కుశాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), రజత్ బగేల్ (వికెట్ కీపర్), వి. యశ్వీర్, ఆర్యన్ సావ్‌సాని, మోహిత్ ఉల్వా, కావ్య పటేల్, షావిన్ వినోద్, ఇషాన్ సూద్
ఇవి కూడా చదవండి:
టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!
కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!