ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తొలి జాబితా విడుదలైన మరుసటి రోజే ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా..
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:32 PM
పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన మరుసటి రోజే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన మరుసటి రోజే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు హర్మీత్ సింగ్ పఠాన్‌మాజ్రా, చేతన్ సింగ్ జౌరామాజ్రా రాజీనామా చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది (Punjab AAP Crisis).
పటియాలా జిల్లాలోని సనౌర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హర్మీత్ సింగ్ పఠాన్‌మాజ్రా, సమానా నియోజకవర్గ ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామాజ్రా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పఠాన్‌మాజ్రా తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపించారు. మరోవైపు మాజీ మంత్రిగా పనిచేసిన జౌరామాజ్రా సామాజిక మాధ్యమం ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. తాను పార్టీని వీడినట్లు ఆయన ధ్రువీకరించారు. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అక్టోబర్ 31న 40 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది (AAP MLAs Resign).
ఈ జాబితాలో పఠాన్‌మాజ్రా, జౌరామాజ్రాల పేర్లు లేవు. ఈ రెండు నియోజకవర్గాలకు పార్టీ ఇంకా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు (AAP Candidate List). అంతకుముందే సనౌర్‌లో రంజోద్ హదానా, సమానాలో మాజీ మంత్రి సుర్జీత్ సింగ్ రఖ్రాలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం కూడా అభ్యర్థుల ఎంపికపై చర్చకు కారణమైంది. హర్మీత్ సింగ్ పఠాన్‌మాజ్రాకు గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంతో విభేదాలు కొనసాగుతున్నాయి. మరో ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామాజ్రా గతంలో భగవంత్ మాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్‌లో మా టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు: ట్రంప్
జపాన్‌ను కుదిపేసిన భారీ భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత