మోదీజీ.. ఇజ్రాయెల్ స్వాతంత్య్ర వేడుకలకు రండి.. నెతన్యాహు ఆహ్వానం
ABN , Publish Date - Oct 22 , 2026 | 09:26 PM
ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవాలకు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ తో కలిసి టార్చ్ వెలిగించాలని మోదీని ఆయన కోరారు. ఈ మేరకు ఎక్స్ లో నెతన్యాహు హిందీ, హిబ్రూ భాషల్లో ట్వీట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్ః ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవాలకు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో కలిసి టార్చ్ వెలిగించాలని మోదీని ఆయన కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో నెతన్యాహు హిందీ, హిబ్రూ భాషల్లో ట్వీట్ చేశారు. తన ఆహ్వానాన్ని మోదీ స్వాగతించారని, అలాగే ఇజ్రాయెల్, భారత్ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారని తెలిపారు. తమ దేశ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆహ్వానించినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారని వెల్లడించారు. నేల మీద, ఆకాశంలో ఉగ్రవాదంపై భారత్, ఇజ్రాయెల్ కలిసికట్టుగా పోరాడుతున్నాయని మోదీ చెప్పారని ఆయన తెలిపారు.
కాగా.. ధైర్య సాహసాలకుగానూ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను ఇజ్రాయెల్ అధ్యక్ష అవార్డుతో సన్మానిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఐజాగ్ హెర్జోగ్ గతంలో తెలిపారు. ఇందుకు మచ్చార్‌ను ఇజ్రాయెల్ రావాలని ఆయన ఆహ్వానించారు. తాజాగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా మోదీకి ఆహ్వానం పలికారు. మరోవైపు ఇజ్రాయెల్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై నెతన్యాహు, మోదీ మాట్లాడుకున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల గురించి, ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పునరుద్ధరణపైనా ఆ ఇద్దరు నేతలు చర్చించారని పీఎంఓ వెల్లడించింది. శాంతి స్థాపనకు చర్చలు, దౌత్యం ఒక్కటే పరిష్కారం అని భారత్ భావిస్తున్నదన్న విషయాన్ని కూడా మోదీ పునరుద్ఘాటించారని పీఎంఓ పేర్కొంది. ప్రధాని మోదీ కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. మృతుల్లో భారతీయుడు
సముద్రం పేరు మారుస్తానంటే.. పిచాయ్ నో చెప్పారు: ట్రంప్