Share News

సౌదీ ఎయిర్‌‌పోర్టుపై దాడి.. మృతుల్లో భారతీయుడు

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:16 PM

సౌదీలోని దమ్మామ్ ఎయిర్‌పోర్టుపై బుధవారం హూతీలు జరిపిన దాడిలో ఇద్దరు మరణించినట్టు దేశ పౌర విమానయాన శాఖ తాజాగా పేర్కొంది.

సౌదీ ఎయిర్‌‌పోర్టుపై దాడి.. మృతుల్లో భారతీయుడు
Indian Killed during Attack on Saudi Airport

ఇంటర్నెట్ డెస్క్: సౌదీలోని దమ్మామ్ ఎయిర్‌పోర్టుపై బుధవారం హూతీలు జరిపిన దాడిలో ఇద్దరు మరణించినట్టు దేశ పౌర విమానయాన శాఖ తాజాగా పేర్కొంది. మృతుల్లో ఓ భారతీయుడు కూడా ఉన్నట్టు వెల్లడించింది. గాయపడ్డ వారిలో భారతీయులతో పాటు యెమెన్, బంగ్లాదేశీ వ్యక్తులు కూడా ఉన్నారని పేర్కొంది. ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నట్టు రియాద్‌లోని భారతీయ ఎంబసీ ఎక్స్ వేదికగా తెలిపింది. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేసింది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.


ఈ దాడిలో ఎయిర్‌పోర్టు ఏ మేరకు దెబ్బతిన్నదో అధికారులు ప్రస్తుతం అంచనా వేస్తున్నాయి. ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను ఇప్పటికే పునరుద్ధరించారు. బుధవారం ఓ డ్రోన్ దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని సౌదీ ఇంధన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, డ్రోన్ శకలాలు తగిలి ఇద్దరు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని చెప్పింది.


హూతీల దాడుల నేపథ్యంలో భారత్, అమెరికా తమ దేశ యాత్రికులకు అలర్ట్‌లు జారీ చేశాయి. అక్కడి ఎంబసీలోని అత్యవసర సిబ్బంది మినహా మిగతా వారు తమ కుటుంబాలతో సహా స్వదేశానికి వచ్చేయాలని అమెరికా సూచించింది. సౌదీ అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని భారతీయ ఎంబసీ కూడా సూచించింది.


ఈ వార్తలనూ చదవండి:

అవి మూర్ఖపు వ్యాఖ్యలు.. ట్రంప్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆగ్రహం..

లాడెన్‌ను గుర్తించిన పాకిస్థాన్‌లోనే దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నాడు: ఐరాసలో భారత్

Updated Date - Oct 22 , 2026 | 04:20 PM