Share News

పాక్ ఆర్మీ చీఫ్‌కు ఇరాన్‌లో అవమానం!

ABN , Publish Date - Oct 22 , 2026 | 08:03 PM

అమెరికా, ఇరాన్ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నంలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్‌కు ఇటీవల ఊహించని పరాభవం జరిగింది.

పాక్ ఆర్మీ చీఫ్‌కు ఇరాన్‌లో అవమానం!
Pak Army Chief told to go back

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నంలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్ మునీర్‌కు ఇటీవల ఊహించని పరాభవం జరిగింది. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్‌కు చేరేవేసేందుకు వెళ్లిన ఆయనను ఇరాన్ భద్రతా మండలి చీఫ్ మొహిసీన్ రిజేవీ వచ్చిన దారినే తిరిగెళ్లిపోవాలని ముఖం మీదే చెప్పినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


అణుకార్యక్రమం కట్టిపెట్టాల్సిందేనన్న ట్రంప్ సందేశాన్ని వినిపించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇటీవల ఇరాన్‌కు వెళ్లారు. అక్కడ భద్రతా మండలి చీఫ్ మొహిసీన్ రిజేవీతో సమావేశమయ్యారు. ట్రంప్ వార్నింగ్స్ గురించి వివరించారు. అయితే, రిజేవీ మాత్రం పాక్‌ ఆర్మీ చీఫ్‌ చెప్పే విషయాల్ని లక్ష్య పెట్టలేదు. విమానమెక్కి వచ్చిన దారినే తిరిగెళ్లిపోవాలని కటువుగా చెప్పినట్టు లెబనాన్‌కు చెందిన ఓ పత్రిక పేర్కొంది. ఇది అధ్యక్షుడు ట్రంప్ చివరి వార్నింగ్ అని ఆసిమ్ మునీర్ చెప్పినా రిజేవీ లెక్కచేయలేదని సమాచారం. మాటవినకపోతే దాడులు తీవ్రమయ్యే అవకాశం ఉందని కూడా ఆసిమ్ మునీర్ హెచ్చరించినట్టు సమాచారం.


అణు కార్యక్రమం విషయంలో పట్టువిడుపుల ధోరణి ఉండాలని ఆసిమ్ మునీర్ చెప్పగా రిజేవీ ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. తమ 7 డిమాండ్స్‌కు అంగీకరించాలని ముందు అమెరికాకు చెప్పాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రిజేవీ, మునీర్‌ల సమావేశం తాలూకు వీడియో కూడా వైరల్‌గా మారింది. వారి మధ్య స్నేహపూర్వక వాతావరణమే లేనట్టు కనిపించిందన్న వ్యాఖ్యలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఇద్దరూ ముక్తసరిగా, అంటీముట్టనట్టు కనిపించారని పలువురు కామెంట్ చేశారు.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంటు స్పీకర్ ముహమ్మద్ ఘాలిబఫ్‌తో కూడా ఆసిమ్ మునీర్ సమావేశమయ్యారు. ట్రంప్ హెచ్చరికలపై తాము కొత్తగా చెప్పేదేమీ లేదని వారు కూడా పేర్కొన్నట్టు తెలిసింది.


ఈ వార్తలనూ చదవండి:

భారత్ ఆందోళనను అర్థం చేసుకున్నాము: యూఎస్ మంత్రి రూబియో

సముద్రం పేరు మారుస్తానంటే.. పిచాయ్ నో చెప్పారు: ట్రంప్

Updated Date - Oct 22 , 2026 | 08:04 PM