Share News

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలి: ప్ర‌ధాని మోదీ

ABN , Publish Date - Oct 22 , 2026 | 08:09 PM

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న సంక్షోభం కూడా త్వ‌ర‌గా ముగిసిపోవాల‌ని కోరుకుంటున్నామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ అన్నారు. శాంతిస్థాప‌న‌కే భార‌త్ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పోలండ్ ప్ర‌ధాని డొనాల్డ్ ​ట‌స్క్​తో క‌లిసి గురువారం ఢిల్లీలో మీడియా స‌మావేశంలో మోదీ మాట్లాడారు.

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలి: ప్ర‌ధాని మోదీ

ఇంట‌ర్నెట్ డెస్క్: ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న సంక్షోభం కూడా త్వ‌ర‌గా ముగిసిపోవాల‌ని కోరుకుంటున్నామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ అన్నారు. శాంతిస్థాప‌న‌కే భార‌త్ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పోలండ్ ప్ర‌ధాని డొనాల్డ్ ​ట‌స్క్​తో క‌లిసి గురువారం ఢిల్లీలో మీడియా స‌మావేశంలో మోదీ మాట్లాడారు. ప్ర‌జాస్వామ్య విలువ‌లపై భార‌త్, పోలండ్ దేశాలకు న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ఆ ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను మ‌రింత బలోపేతం చేయ‌డానికి అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌ల్లో సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మ‌న్నారు. భార‌త్, యూరోపియ‌న్ యూనియ‌న్ మ‌ధ్య కుదిరిన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం అద్భుత‌మ‌ని కొనియాడారు. భార‌త్, పోలండ్ మ‌ధ్య ఆర్థిక స‌హకారం మరింత బ‌లోపేతం అయ్యేలా ఆ ఒప్పందం స‌హ‌క‌రిస్తుంద‌న్నారు. అలాగే ర‌క్ష‌ణ‌, అంత‌రిక్షం, న్యూక్లియ‌ర్ ఎన‌ర్జీ రంగాల్లోనూ స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకునేందుకు భార‌త్, పోలండ్ ఒప్పందం చేసుకున్నాయ‌ని ప్ర‌ధాని తెలిపారు.


ట‌స్క్​పై మోదీ అభినంద‌న‌లు..

ప్ర‌పంచం నేడు సందిగ్ధంలో ఉంద‌ని, అలాంటి స‌మ‌యంలో వృద్ధి, టెక్నాల‌జీ, ఇన్నొవేష‌న్​కు ప్ర‌ధాన కేంద్రాలుగా భార‌త్, పోలండ్ ఎదుగుతున్నాయ‌ని మోదీ అన్నారు. పోలండ్ జీడీపీ ట్రిలియ‌న్ దాటింద‌ని, ఇందుకు ఆ దేశ ప్ర‌ధాని ట‌స్క్​ను అభినందిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. భార‌త్ కూడా గ‌త త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు న‌మోదు చేసింద‌న్నారు.

పోలండ్ ప్ర‌ధాని డొనాల్డ్ ట‌స్క్ మాట్లాడుతూ.. భార‌త్, పోలండ్ మ‌ధ్య ద్వైపాక్షిక బంధంపై ప్రశంసలు కురిపించారు. ద్వైపాక్షిక సంబంధాలు మ‌రింత మెరుగ‌వ‌డానికి రెండు దేశాలూ మ‌రింత‌గా స‌హ‌క‌రించుకుంటాయ‌న్నారు. శాటిలైట్లు, డ్రోన్ల రంగాల్లో ఆ రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారం.. ప్ర‌పంచ దేశాలు రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లు, సంక్షోభాలను త‌గ్గించుకునేందుకు సాయం చేసింద‌న్నారు.


ఈ వార్తలనూ చదవండి:

సౌదీ ఎయిర్‌‌పోర్టుపై దాడి.. మృతుల్లో భారతీయుడు

సముద్రం పేరు మారుస్తానంటే.. పిచాయ్ నో చెప్పారు: ట్రంప్

Updated Date - Oct 22 , 2026 | 08:38 PM