Share News

కిడ్నీ బాధితులు బీట్‌రూట్ తినొచ్చా?

ABN , Publish Date - Jul 11 , 2026 | 09:16 AM

కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీ బాధితులు బీట్‌రూట్ తినొచ్చా?
Beetroot For Kidney Patients

ఇంటర్నెట్ డెస్క్: మధుమేహం, అధిక రక్తపోటు, మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బీట్‌రూట్ కిడ్నీ రోగులకు మంచిదా? లేక హానికరమా? అనే సందేహానికి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..


కిడ్నీ బాధితులు బీట్‌రూట్ తినొచ్చా?

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDK) ప్రకారం.. కాల్షియం ఆక్సలేట్ రాళ్లు వచ్చే ప్రమాదం ఉన్నవారు ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి. బీట్‌రూట్ కూడా అలాంటి ఆహారాల్లో ఒకటి. అయితే, కిడ్నీ బాధితులు బీట్‌రూట్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల సమస్య లేకపోతే.. వైద్యులు లేదా డైటీషియన్ సలహా మేరకు పరిమిత మోతాదులో బీట్‌రూట్ తీసుకోవచ్చు. అంటే, బీట్‌రూట్ తినాలా వద్దా అనేది మీకు ఉన్న కిడ్నీ సమస్య రకాన్ని బట్టి నిర్ణయించాలి. వైద్యుల సలహా లేకుండా ఆహారంలో పెద్ద మార్పులు చేయకపోవడం మంచిది.


ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి?

కాల్షియం ఆక్సలేట్ రాళ్లు వచ్చే ప్రమాదం ఉన్నవారు ఈ ఆహారాలను పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • పాలకూర

  • బీట్‌రూట్

  • బాదం

  • వేరుశెనగ

  • చాక్లెట్

  • అధిక ఉప్పు

  • ప్రాసెస్ చేసిన ఆహారాలు

  • ప్యాక్ చేసిన స్నాక్స్

  • చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు

వీటిని కూడా తగ్గించడం మంచిది.


కిడ్నీ బాధితులు ఏం తినాలి?

కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యులు లేదా పోషకాహార నిపుణులు సూచించిన ఆహారాన్నే పాటించాలి. సాధారణంగా, తగినంత నీరు తాగడం, తాజా పండ్లు, తక్కువ ఆక్సలేట్ ఉన్న కూరగాయలు, తృణధాన్యాలు, అవసరమైన మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం మంచిది. అలాగే ఉప్పు వినియోగాన్ని తగ్గించి, ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వైద్యుల సూచనల మేరకు ఆహారం తీసుకోవడమే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమ మార్గం.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 09:16 AM