Share News

నాందేడ్‌ నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:06 PM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్‌ - తిరుచానూర్‌ - నాందేడ్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

నాందేడ్‌ నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైళ్లు
Nanded-Tiruchanur special train

  • కరీంనగర్‌, పెద్దపల్లి, జమ్మికుంట్ల మీదుగా రాకపోకలు

పెద్దపల్లి: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్‌ - తిరుచానూర్‌ - నాందేడ్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు పెద్దపల్లి రైల్వే స్టేషన్‌తోపాటు కరీంనగర్‌, వరంగల్‌, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో రెండు దిశల్లోనూ ఆగనున్నాయి. రైల్వేశాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 07603 నాందేడ్‌- తిరుచానూర్‌ ప్రత్యేక రైలు ఈనెల 21 నుంచి ఆగస్టు 25 వరకు ప్రతీ మంగళవారం నడుస్తుంది.


train2.jpgమొత్తం ఆరు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే 07604 తిరుచానూర్‌ - నాందేడ్‌ ప్రత్యేక రైలు ఈనెల 22 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతీ బుధవారం నడపనున్నారు. ఈ రైలును కూడా మొత్తం ఆరుసార్లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ముద్‌ఖేడ్‌, ధర్మాబాద్‌, బాసర, నిజామాబాద్‌, ఆర్మూర్‌, కోరుట్ల, లింగంపేట-జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో రెండు దిశల్లోనూ ఆగనున్నాయి.


train.jpgఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్లకు 18:30 గంటలకు, లింగంపేట జగిత్యాలకు 19 గంటలకు, కరీంనగర్‌కు 20.28 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కు 21:00 గంటలకు, జమ్మికుంటకు 22:00 గంటలకు వస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లలో థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుచానూర్‌, తిరుపతి ప్రాంతాలకు వెళ్లే భక్తులు, ఇతర ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

యువతలో నైపుణ్యానికి పదును

ఆషాఢ ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 12:06 PM