ఎల్‌నినో ప్రభావంతో రైతన్నలు నష్టపోతున్నారు: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jul 15 , 2026 | 10:33 AM
ఎల్‌నినో ప్రభావంతో రైతన్నలు కొంత నష్టపోతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అనుకున్న సమయానికి వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు.
హైదరాబాద్, జులై 15 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రైతన్నలు కొంత నష్టపోతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Telangana Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. అనుకున్న సమయానికి వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. దానికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు వెళ్తే బాగుటుందని సూచించారు. ఈరోజు (బుధవారం) మంత్రి తుమ్మల ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.
రేపటి నుంచి ఆగస్టు రెండో వారంలోగా ఆరుతడి పంటలపైన అవగాహనా కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆయా జిల్లాల వారీగా వివరాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ పంటల కోసం అన్నదాతలకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఇంకా నిర్ణయించలేదని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ కర్తవ్యమని తెలిపారు. కంది, సొయాబీన్, పెసర, మినుము, జొన్నా, సజ్జల సాగుకు రైతులు సిద్ధపడాలని సూచించారు. వర్షాల మీద ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ.. కేంద్రమంత్రులు గడ్కరీ, రామ్మోహన్‌తో కీలక భేటీలు
పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ వ్యూహరచన.. సోనియా నివాసంలో కీలక భేటీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News