మళ్లీ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కువైట్, జోర్డాన్‌పై ఐఆర్‌జీసీ తాజా దాడులు..
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:51 PM
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజాగా కువైట్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తాజాగా కువైట్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. ఈ దాడుల్లో పలు క్షిపణులను ఆయా దేశాల వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు (IRGC attacks Kuwait Jordan).
అమెరికా విధించిన నౌకాదిగ్బంధనం, వైమానిక దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టామని ఇరాన్ ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి మూసివేశామని, అవసరమైతే ఇతర కీలక సముద్ర మార్గాల్లోనూ ఇంధన రవాణాను అడ్డుకుంటామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. ఐఆర్‌జీసీ దాడుల కారణంగా కువైట్, జోర్డాన్‌తో పాటు బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు కూడా అప్రమత్తమయ్యాయి (US Iran war). పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించారని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని స్థానిక మీడియా తెలిపింది.
తాజా ఘర్షణల నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలను కొనసాగిస్తోంది. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన పలు క్రిప్టో వాలెట్లను అమెరికా ఫ్రీజ్ చేసింది. మరోవైపు ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై గత ఏడు గంటలుగా దాడులు కొనసాగిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది (Donald Trump Iran).
కాగా, అమెరికా దురాగతాలు పూర్తిగా ఆగిపోయేవరకు హోర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఈ ఘర్షణ ఇలాగే కొనసాగితే అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన ఇంధన నౌకలు వెళ్లే మార్గాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-0తో ఘన విజయం