Share News

గల్ఫ్ ఉద్రిక్తతలు.. ఇప్పటివరకూ 13 మంది భారతీయుల మృతి

ABN , Publish Date - Jul 14 , 2026 | 10:40 PM

ఫిబ్రవరి 28న గల్ఫ్ ఉద్రిక్తతలు చెలరేగిన నాటి నుంచీ ఇప్పటివరకూ గల్ఫ్ ప్రాంతంలో 13 మంది భారతీయులు మరణించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

గల్ఫ్ ఉద్రిక్తతలు.. ఇప్పటివరకూ 13 మంది భారతీయుల మృతి
US Iran War

ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 28న గల్ఫ్ ఉద్రిక్తతలు చెలరేగిన నాటి నుంచీ ఇప్పటివరకూ గల్ఫ్ ప్రాంతంలో 13 మంది భారతీయులు మరణించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇటీవల హోర్ముజ్ జలసంధిలో రెండు ఆయిల్ ట్యాంకర్లపై దాడి జరిగింది. ఎమ్‌టీ అల్ బాహ్యాపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు కన్నుమూసిన విషయం తెలిసిందే. అంతకురెండు రోజుల ముందే సైప్రస్ దేశ జెండాతో వెళుతున్న జీఎఫ్ఎస్ గ్యాలక్సీ సరకురవాణా నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ సిబ్బంది గల్లంతయ్యారు. ఆయన ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.


ఎమ్‌టీ అల్ బాహ్యా‌లో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా అందులో 12 మంది భారతీయులు, ఆరుగురు ఫిలిప్పీన్స్ వాసులు, ఇద్దరు రష్యన్లు, ఒక ఈజిప్ట్ జాతీయుడు, మరో శ్రీలంక వ్యక్తి ఉన్నారు. ఇక ఎమ్‌టీ మొంబాసా బీలో 17 మంది భారతీయులు ఉన్నట్టు తెలిసింది. ఆయిల్ ట్యాంకర్లపై దాడి తామే చేశామని ఐఆర్‌జీసీ ప్రకటించింది.

గత నెలలో పలావు దేశ జెండాతో వెళుతున్న ఒక నౌకపై అమెరికా చేసిన దాడిలో ముగ్గురు భారతీయులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో ఏడు నౌకలు ఉన్నట్టు తెలుస్తోంది. వాటిలో 148 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. గల్ఫ్‌లో పరిస్థితి మెరుగుపడే వరకూ అక్కడే వేచి చూసేందుకు నౌకల్లోని సిబ్బంది నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్ టోల్ ఫీజుపై వెనక్కు తగ్గిన ట్రంప్

హసీనా బంగ్లాదేశ్ వస్తే అరెస్ట్ చేస్తాం: బంగ్లాదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

Updated Date - Jul 14 , 2026 | 11:42 PM