Share News

హసీనా బంగ్లాదేశ్ వస్తే అరెస్ట్ చేస్తాం: బంగ్లాదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:54 PM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా రెండేళ్లుగా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లో వివాదాల కారణంగా ఆమె 2024 ఆగస్టు నెలలో ఇండియాకు వచ్చారు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు.

హసీనా బంగ్లాదేశ్ వస్తే అరెస్ట్ చేస్తాం: బంగ్లాదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
Bangladesh News

ఇంటర్‌నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా రెండేళ్లుగా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లో వివాదాల కారణంగా ఆమె 2024 ఆగస్టు నెలలో ఇండియాకు వచ్చారు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోవటం గురించి కొద్దిరోజుల క్రితం హసీనా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘అన్ని అడ్డంకులను, కుట్రలను అధిగమిస్తున్నాను. ఈ ఏడాది నా దేశానికి తిరిగి వెళ్లిపోతాను’ అని అన్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళతానని చెప్పటంపై ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శామా ఒబేద్ ఇస్లాం స్పందించారు.


బంగ్లాదేశ్ న్యూస్ ఏజెన్సీ బీఎస్ఎస్‌తో శామా మాట్లాడుతూ.. ‘ఒక వేళ షేక్ హసీనా లొంగిపోతే.. చట్ట ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుంటాం. హసీనా తప్పక జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇండియాలో లొంగిపోయినా.. బంగ్లాదేశ్‌కు వచ్చి లొంగిపోయినా.. మొదట ఆమె జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. నేరస్థులు చేసే వ్యాఖ్యలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదు. అజ్ఞాతంలోకి వెళ్లిన అవామీ లీగ్ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఆమె విదేశాల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతకంటే వేరే కారణం నాకు కనిపించడం లేదు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ వ్యూహరచన.. సోనియా నివాసంలో కీలక భేటీ

మహిళా న్యాయమూర్తిపై వృద్ధురాలి చేతబడి.. సీటుపై తెల్ల ఆవాలు చల్లి..

Updated Date - Jul 14 , 2026 | 02:00 PM