మహిళా న్యాయమూర్తిపై వృద్ధురాలి చేతబడి.. సీటుపై తెల్ల ఆవాలు చల్లి..
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:05 PM
ఓ కేసులో తనకు అనుకూలంగా తీర్పు రావాలన్న ఉద్దేశంతో 65 ఏళ్ల ఓ వృద్ధురాలు పిచ్చి పనికి తెరతీసింది. మహిళా న్యాయమూర్తిపై చేతిబడికి పూనుకుంది. కోర్టులో మహిళా న్యాయమూర్తి కూర్చునే సీటుపై చేతబడికి సంబంధించిన కార్యకలాపాలు చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ కేసులో తనకు అనుకూలంగా తీర్పు రావాలన్న ఉద్దేశంతో 65 ఏళ్ల ఓ వృద్ధురాలు పిచ్చి పనికి తెరతీసింది. మహిళా న్యాయమూర్తిపై చేతిబడికి పూనుకుంది. కోర్టులో మహిళా న్యాయమూర్తి కూర్చునే సీటుపై చేతబడికి సంబంధించిన కార్యకలాపాలు చేసింది. సీసీటీవీ కెమెరాల కారణంగా ఆమె చేసిన పని వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిక్కబళ్లాపూర్‌కు చెందిన మంజుల అనే వృద్ధురాలికి సంబంధించిన కేసు ‘ఫస్ట్ అడిషినల్ సీనియర్ సివిల్ జడ్జ్ అండ్ కోర్ట్ ఆఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు’లో నడుస్తోంది. తీర్పు తనకు అనుకూలంగా రావాలన్న ఉద్దేశంతో మంజుల ఓ పిచ్చి పనికి తెరతీసింది. కొద్దిరోజుల క్రితం కోర్టులోని మహిళా న్యాయమూర్తి సీటుపై తెల్ల ఆవాలు చల్లి చేతబడి చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కోర్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంజులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇక, ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండు రోజుల క్రితం నిందితురాలు న్యాయమూర్తి సీటుపై తెల్ల ఆవాలు చల్లుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఆదాయానికి మించి అక్రమాస్తులు.. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ఏసీబీ రైడ్స్
పెన్షన్ కోసం వెళ్తే.. ఖాతాలో రూ.759 కోట్లు! అసలేం జరిగింది?