Share News

ఆదాయానికి మించి అక్రమాస్తులు.. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ఏసీబీ రైడ్స్

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:46 PM

హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాల కలకలం రేగింది. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఆదాయానికి మించి అక్రమాస్తులు.. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ఏసీబీ రైడ్స్
ACB Raids

హైదరాబాద్, జులై 14: నగరంలో మరోసారి ఏసీబీ సోదాల కలకలం రేగింది. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. బచ్చు రవీందర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయిన నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్టు చీఫ్ ఇంజినీర్‌పై ఆరోపణలు ఉన్నాయి.


దీంతో ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలకు దిగారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రవీందర్ నివాసంలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలతోపాటు, వివిధ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను అధికారులు గుర్తించారు. రవీందర్ నివాసంలో బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్‌ వేధింపులు..

హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం.. పోలీసులకు పట్టుబడ్డ రౌడీషీటర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 01:30 PM