కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్ వేధింపులు..
ABN , Publish Date - Jul 14 , 2026 | 10:38 AM
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేను ప్రశ్న యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ వేధింపులకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడి సోదరుడు ఇంద్రసేన నాయుడు కుట్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అనంతపురం, జులై 14: కళ్యాణదుర్గం ఎమ్మెల్యేను ప్రశ్న యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ వేధింపులకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడి సోదరుడు ఇంద్రసేన నాయుడు కుట్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిలినేని సురేంద్ర బాబుపై అవినీతి ఆరోపణల వీడియో వెనుక కూడా ఇంద్రసేన నాయుడు, ప్రశ్న సీఈవో గమన ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే వైసీపీ చేస్తున్న విష ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలంటూ పలుమార్లు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గమన వ్యవహారం వెలుగులోకి రావడంతో జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రశ్న సీఈవో గమనతోపాటు, వైసీపీ నేత ఇంద్రసేన నాయుడి వ్యవహారాలు ప్రస్తుతం అనంతపురం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇవి కూడా చదవండి...
కర్నూలులో రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి
వియత్నాం బోటు ప్రమాదం.. శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
Read Latest AP News And Telugu News