పెన్షన్ కోసం వెళ్తే.. ఖాతాలో రూ.759 కోట్లు! అసలేం జరిగింది?
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:43 PM
ఒక వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ.759 కోట్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నట్లు చూపిస్తున్న వైరల్ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఒక వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. 759 కోట్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నట్లు చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో తెగ వైరల్ అవుతోంది. 75 ఏళ్లు పైబడిన రాంచంద్ర వర్మ అనే వృద్ధుడు తన నెలవారీ పెన్షన్ రూ. 1,100 విత్‌డ్రా చేసుకోవడానికి ఒక స్థానిక సేవా కేంద్రానికి వెళ్లినట్లు ఆ క్లిప్‌లో పేర్కొన్నారు. ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ (Aadhaar authentication) ద్వారా లావాదేవీ నిర్వహిస్తున్న సమయంలో.. అక్కడ ఉన్న ఆపరేటర్ సదరు వృద్ధుడి ఖాతాలో రూ. 759.59 కోట్లకు పైగా బ్యాలెన్స్ ఉండటాన్ని గమనించారు. ఆ స్క్రీన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తం నిజంగానే అతని ఖాతాలో ఉందా లేదా ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బ్రౌజర్ డెవలపర్ టూల్స్ సహాయంతో వెబ్‌పేజీలోని వివరాలను సులభంగా మార్చవచ్చని, కాబట్టి ఇది నకిలీ వీడియో లేదా ఎడిట్ చేసిన స్క్రీన్ షాట్ కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేనందున ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మరికొందరు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యాలెన్స్‌పై అటు బ్యాంకింగ్ అధికారుల నుంచి గానీ, ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి గానీ ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.
ఇవి కూడా చదవండి...
కర్నూలులో రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి
Read Latest AP News And Telugu News