Share News

హోర్ముజ్‌లో యూఏఈ నౌకలపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి..

ABN , Publish Date - Jul 14 , 2026 | 07:42 AM

ఇరాన్, అమెరికా దేశాల మధ్య జూన్ నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. తాజాగా, హోర్ముజ్ జలసంధిలోని ఒమన్ ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న రెండు యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది.

హోర్ముజ్‌లో యూఏఈ నౌకలపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి..
Iran Missile Attack

ఇంటర్‌నెట్ డెస్క్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, అమెరికా దేశాల మధ్య జూన్ నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. తాజాగా, హోర్ముజ్ జలసంధిలోని ఒమన్ ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న రెండు యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది.


'మొంబాసా', 'అల్ బహియా' ట్యాంకర్లపై రెండు క్రూయిజ్ మిసైల్‌లను ప్రయోగించింది. ఈ మిసైల్ దాడుల కారణంగా ట్యాంకర్‌లో పనిచేస్తున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఎనిమిది మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ ఎనిమిది మందిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. తమ నౌకలపై ఇరాన్ దాడి చేయటంపై యూఏఈ స్పందించింది.


ఈ మేరకు మంగళవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ఇరాన్ దాడిని యూఏఈ రక్షణ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల తీవ్ర ఉల్లంఘనగా.. ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పేర్కొంది. తమ పౌరులను, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

దొంగతనం చేశారనే అనుమానంతో కరెంట్ షాక్.. వీడియో వైరల్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 12 గంటల నుంచి కరెంట్ కట్..

Updated Date - Jul 14 , 2026 | 07:50 AM