హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 12 గంటల నుంచి కరెంట్ కట్..
ABN , Publish Date - Jul 14 , 2026 | 07:29 AM
హైదరాబాద్ చందానగర్ ఏరియాలో మరమ్మతులు కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని ఏఈ హుస్సేన్ తెలిపారు.
చందానగర్(హైదరాబాద్): హైదరాబాద్ చందానగర్ ఏరియాలోగల ఇంజనీరింగ్ ఎన్‌క్లేవ్ గంగారం, హుడాకాలనీ ఫీడర్ల పరిధిలో మరమ్మతులు కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని ఏఈ హుస్సేన్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 వరకు హుడాకాలనీ, ఇంజనీరింగ్ ఎన్‌క్లేవ్, గంగారం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
మంజీర డైమండ్, పద్మశ్రీగార్డెన్ పరిధిలో..
రాయదుర్గం: మంజీర డైమండ్, పద్మశ్రీగార్డెన్ విద్యుత్ ఫీడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం వద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శివకృష్ణప్రసాద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు జర్నలిస్టు కాలనీ, గౌలిదొడ్డి, నానక్‌రాంగూడలో విద్యుత్ ఉండదన్నారు.
బోయినపల్లి: బోయినపల్లి 11 కేవీ ఫిడర్స్ పరిధిలో ట్రీ ట్రిమ్మింగ్, ఫీడర్స్ ఫర్ మెయింటెనెన్స్ పనులు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి ఏడీఈ కె. నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు సీతారాంపురం, గణేష్ కాలనీ, మర్రి రామ్‌రెడ్డి కాలనీ, యాదవ్ బస్తీ, పాత కల్యాణి థియేటర్, బృందావన్ కాలనీ, సిండికేట్ బ్యాంక్ కాలనీ, ఐస్ ఫ్యాక్టరి ప్రాంతాల్లో, అదేవిధంగా మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు సాయి దర్శన్ అపార్ట్‌మెంట్స్, జయానగర్, సాయి కృపా అపార్ట్‌మెంట్స్, ద్వారకా మా అపార్ట్‌మెంట్స్, చిట్టా రెడ్డి కాలనీ, నూతన్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఏడీఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
పేట్‌బషీరాబాద్: కొంపల్లి సబ్-స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా మంగళవారం విద్యుత్ ఉండదని ఏఈ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కొంపల్లి, వీజీ, విఘ్నేశ్వర్ ఫీడర్‌లోని పలు ప్రాంతాల్లో 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్ ప్రసారం ఉండదు.
ఈ వార్తలు కూడా చదవండి:
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హయాంలోనే సింగరేణికి నష్టాలు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఎంతంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News