Share News

కేపీఎస్‌సీ చైర్మన్‌పై సస్పెన్షన్‌ వేటు

ABN , Publish Date - Jul 14 , 2026 | 06:20 AM

కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (కేపీఎ్‌ససీ) చైర్మన్‌ శివశంకరప్ప సాహుకార్‌ను సస్పెండ్‌ చేస్తూ గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు...

కేపీఎస్‌సీ చైర్మన్‌పై సస్పెన్షన్‌ వేటు

తన ఇద్దరు కుమార్తెలను అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ఎంపిక చేసేందుకు ప్రయత్నం

బెంగళూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (కేపీఎ్‌ససీ) చైర్మన్‌ శివశంకరప్ప సాహుకార్‌ను సస్పెండ్‌ చేస్తూ గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన తన ఇద్దరు కుమార్తెలను అక్రమ మార్గంలో పారిశ్రామిక విస్తరణాధికారులుగా నియమించేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. శివశంకరప్ప వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దీని కోసం రాజ్యాంగంలోని 317(1) ఆర్టికల్‌ కింద రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టుకు వెళ్లాలని గవర్నర్‌ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అంతకుముందు శివశంకరప్ప నిబంధనలకు విరుద్ధంగా, అక్రమ మార్గాల్లో తన ఇద్దరు కుమార్తెలను పారిశ్రామిక విస్తరణాధికారి ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యారని లోక్‌భవన్‌కు ఫిర్యాదులు అందాయి. ఏడాదికి రూ.40 వేలు మాత్రమే ఆదాయం ఉన్నట్టు చూపించి, ఒక కుమార్తెకు కుల ధ్రువీకరణపత్రాన్ని పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై లోక్‌భవన్‌ విచారణ జరిపించింది. శివశంకరప్ప నిబంధనలు ఉల్లంఘించి, రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందేందుకు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను దాచి ఉంచినట్టు గుర్తించింది. దీంతో, ఆయనపై గవర్నర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి...

దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 06:20 AM