హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
ABN , Publish Date - Jul 12 , 2026 | 03:59 PM
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ అధికారులు ఈరోజు(ఆదివారం) మెగా ఆపరేషన్ నిర్వహించారు. ఓ బస్సులో గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్, జులై 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ అధికారులు (Hyderabad Eagle Force) ఈరోజు (ఆదివారం) మెగా ఆపరేషన్ నిర్వహించారు. ఓ బస్సులో గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సునే డ్రగ్స్ రవాణాకు స్మగ్లర్లు వినియోగించారు. డ్రైవర్, కండక్టర్, హెల్పర్ కుమ్మక్కై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒడిశాలో గంజాయి లోడ్ చేసి హైదరాబాద్‌కు బస్సు సిబ్బంది తీసుకువచ్చారు. కమీషన్ కోసం డ్రగ్స్ రవాణాకు డ్రైవర్, కండక్టర్, హెల్పర్ ఒప్పుకున్నట్లు ఈగల్ అధికారుల దర్యాప్తులో తేలింది.
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు 41 కిలోల గంజాయి రవాణా చేసినట్లు ఈగల్ అధికారులు తెలిపారు. డెలివరీకి ముందే అధికారులు మెరుపు దాడి చేశారు. డ్రైవర్, కండక్టర్,హెల్పర్ కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి రూ.20.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా చేసిన బాబా భోలానాథ్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రిసీవర్‌తో పాటు మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్‌ను డ్రగ్స్ మాఫియా అడ్డాగా పలు ముఠాలు మారుస్తున్నట్లు ఈగల్ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి.. భూగర్భ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు
డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News