Home » Eagle
మాదక ద్రవ్యాల నియంత్రణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పురస్కారం సాధించిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్య నిరోధక విభాగాల మూడో జాతీయ సదస్సులో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అత్యుత్తమ పురస్కారాన్ని అందుకోవడం తెలంగాణ పోలీసు శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది, పటిష్టమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో ఏపీ ఈగల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
రాజస్థాన్ -హైదరాబాద్ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టయింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రెండు వేర్వేరు కేసుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ అధికారులు ఈరోజు(ఆదివారం) మెగా ఆపరేషన్ నిర్వహించారు. ఓ బస్సులో గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు.
డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత ఏడాదిలో ఏకంగా ఏడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఒడిసా నుంచి తెలంగాణకు గంజాయి రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో అంతరాష్ట్ర స్మగ్లర్ల ముఠాను ఈగల్ బృందం వెంటాడింది
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లామని చెప్పారు.
విశాఖపట్నంలో ఈగల్ టీం, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు.
డ్రగ్ మనీ లాండరింగ్ కింగ్‌పిన్ దర్గారం ప్రజాపతిని ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో రూ.3 కోట్ల హవాలా డబ్బును ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. నైజీరియా డ్రగ్ కార్టెల్‌కు డబ్బు సరఫరా చేసిన నెట్వర్క్ ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేశారు.
డబ్బు సంపాదనే లక్ష్యంగా మత్తు మందును తయారు చేసి విక్రయిస్తున్న మేధ స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాశ్ గౌడ్‌ను అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్‌గుడా జైలుకు తరలించారు.