Share News

హైదరాబాద్‌లో ఈ-సిగరెట్ల స్మగ్లింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్

ABN , Publish Date - Nov 15 , 2026 | 08:18 PM

తెలంగాణలో ఈ - సిగరెట్ల అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ నెట్‌వర్క్ గుట్టును ఈగల్ ఫోర్స్ రట్టు చేసింది. అందుకు సంబంధించి రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఇద్దరు వ్యక్తులు.. రహీల్ ఖాన్ అలియాస్ ఓమర్‌, మహమ్మద్ ఆసిఫ్‌ను అరెస్ట్ చేసింది.

హైదరాబాద్‌లో ఈ-సిగరెట్ల స్మగ్లింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణలో ఈ - సిగరెట్ల అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ నెట్‌వర్క్ గుట్టును ఈగల్ ఫోర్స్ రట్టు చేసింది. అందుకు సంబంధించి రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఇద్దరు వ్యక్తులు.. రహీల్ ఖాన్ అలియాస్ ఓమర్‌, మహమ్మద్ ఆసిఫ్‌ను అరెస్ట్ చేసింది. వీరు కోల్‌కతా టు హైదరాబాద్.. హైదరాబాద్ టు కరీంనగర్‌కు ఈ సిగరెట్లు కొరియర్, ట్రాన్స్‌పోర్ట్‌ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. మైనర్ బాలుడికి నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తుండగా మహమ్మద్ ఆసిఫ్‌ను ఈగల్ ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.


హైదరాబాద్‌కు చెందిన ఆయాన్, ఓమర్ నుంచి కొరియర్ ద్వారా ఈ సిగరెట్ల సరుకు తెప్పించుకున్నట్లు ఆసీఫ్ వెల్లడించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లోని సరఫరాదారులపై ఈగల్ ఫోర్స్ నిఘా ఉంచింది. ఈ క్రమంలో మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ చేపట్టింది. ఈ సందర్భంగా రహీల్ ఖాన్ అలియాస్ ఓమర్‌ను అరెస్ట్ చేసింది. అతడిపై మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. విచారించింది. ఈ సందర్భంగా చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు ఫుట్‌పాత్‌పై దుస్తుల వ్యాపారం చేస్తూ.. లోపల ఈ-సిగరెట్ల దందా చేస్తున్నట్లు విచారణలో వెల్లడించాడు.


అతడు గతంలో జొమాటో, పోర్టర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసినట్లు వివరించాడు. అలా డెలివరీ పరిచయాలతో ఈ-సిగరెట్ల అక్రమ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. గతంలోనూ అతడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ-సిగరెట్ల కేసు నమోదయింది. కలకత్తా నుంచి ఏడుసార్లు అతడు సరుకు తెప్పించినట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. ఒక్కోసారి సుమారు 20 ఈ-సిగరెట్ల చొప్పున ఆర్డర్లు పెట్టి.. పేమెంట్ స్కానర్ కోడ్ పంపి నగదును ముఠా వసూలు చేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. అలా కరీంనగర్‌కు దాదాపు 20 సార్లకుపైగా అతడు ఈ సిగరెట్ సరఫరా చేసినట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని మహిళ మృతి, భర్తకు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని మహిళ మృతి, భర్తకు తీవ్ర గాయాలు

For More AP News And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 08:29 PM