హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని మహిళ మృతి, భర్తకు తీవ్ర గాయాలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 03:49 PM
హైదరాబాద్‌లోని బాలాపూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని టిప్పర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటిపై ప్రయాణిస్తున్న దంపతుల్లో చిట్టెమ్మ (55) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్, నవంబర్ 15: నగరంలోని బాలాపూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని టిప్పర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటిపై ప్రయాణిస్తున్న దంపతుల్లో చిట్టెమ్మ (55) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చిట్టెమ్మ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం కావడంతో బాలాపూర్ సమీపంలోని చర్చికి ఈ దంపతులు వెళ్లారు. ప్రార్థన అనంతరం మల్లాపూర్‌లోని ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై చిట్టెమ్మ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వివరించారు.