గంజాయి ముఠాలపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:43 AM
ఈగల్ ఫోర్స్, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు, దాడుల్లో భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని, 8 మందిని అరెస్టు చేశారు.
కోదాడ, జడ్చర్ల, హైదరాబాద్‌లలో 8 మంది అరెస్టు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/ కోదాడ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఈగల్ ఫోర్స్, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు, దాడుల్లో భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని, 8 మందిని అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో రూ.75 లక్షల విలువైన 150 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. జడ్చర్లలో ముగ్గురు గంజాయి పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక, నాగపూర్ నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఆటో డ్రైవర్ షేక్ ఆసిఫ్ (38)ను చార్మినార్ టాస్క్‌ఫోర్స్, బండ్లగూడ పోలీసులు అరెస్టు చేశారు. 1.94 కిలోల గంజాయి, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రాజస్థాన్ నుంచి నల్లమందు తెచ్చి షాపూర్‌నగర్‌లో విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News