Share News

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:12 PM

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడేది లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కంచె గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు ప్రభుత్వానికి దక్కిన వరుస న్యాయ విజయాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
Telangana Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడేది లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. కంచె గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు ప్రభుత్వానికి దక్కిన వరుస న్యాయ విజయాలని పేర్కొన్నారు. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూల తీర్పు వచ్చిందని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈరోజు (శుక్రవారం) మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడారు. తాజాగా మియాపూర్ భూముల విషయంలోనూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో విజయం వరించిందని తెలిపారు.


ప్రభుత్వ భూములను కాపాడుతాం..

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రెవెన్యూ, న్యాయశాఖ, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయంతో న్యాయపోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పాత భూ రికార్డులు, రెవెన్యూ ఆధారాల పరిశీలనతో ప్రభుత్వ హక్కులను పరిరక్షిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు.. రాష్ట్ర ప్రజల ఉమ్మడి ఆస్తి అని ఉద్ఘాటించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. న్యాయపోరాటంలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులకు మంత్రి అభినందనలు తెలిపారు. భవిష్యతు తరాల ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను కాపాడుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి భద్రత కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

కరవును చంద్రబాబు బాగా మేనేజ్‌ చేశారు.. కేటీఆర్ ప్రశంసలు

ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 04:46 PM