Share News

కరవును చంద్రబాబు బాగా మేనేజ్‌ చేశారు.. కేటీఆర్ ప్రశంసలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:18 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశంసలు కురిపించారు. కరవును చంద్రబాబు బాగా మేనేజ్‌ చేశారని కొనియాడారు.

కరవును చంద్రబాబు బాగా మేనేజ్‌ చేశారు.. కేటీఆర్ ప్రశంసలు
KTR

హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశంసలు కురిపించారు. కరవును చంద్రబాబు బాగా మేనేజ్‌ చేశారని కొనియాడారు. ఈ విషయంలో చంద్రబాబును ప్రత్యేకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.


ఈరోజు (గురువారం) హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో తెలంగాణ కంటే ఎక్కువ కరవు ఉందని చెప్పుకొచ్చారు. కర్ణాటక, ఏపీలో లేని కరవు తెలంగాణకు ఎందుకొచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ను ప్రశ్నించారు. 33% కమీషన్‌ సర్కార్‌ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డే అన్నారని చెప్పారు. ఎమ్మెల్యే కొండా సురేఖ ఏం చెప్పారో తాను ఇంకా చూడలేదని అన్నారు. తనకు ఇంకా క్షమాపణ చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:51 PM