ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Oct 29 , 2026 | 07:14 PM
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై ఈరోజు (గురువారం) రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కీలక అంశాలపై చర్చించారు. ఈ సమీక్షలో ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి..
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలని భట్టి విక్రమార్కపేర్కొన్నారు. వ్యవసాయం, విద్యుత్, గృహ వసతి, వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు అందుతున్న ప్రయోజనాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో గుర్తించిన 1,300 ఎకరాల ఖాళీ భూమి వినియోగంపై దృష్టిసారించామని చెప్పుకొచ్చారు. ఇళ్లస్థలాలు లేని అర్హులకు భూముల కేటాయింపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మార్గనిర్దేశం చేశారు.
విద్యుత్, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి..
ప్రతి నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికల అవసరాలను గుర్తించాలని భట్టి విక్రమార్క సూచించారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో విద్యుత్, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మొబైల్ వైద్య యూనిట్ల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. సబ్‌ప్లాన్ నిధుల ఖర్చు, లబ్ధిదారుల వివరాలను డిజిటల్ విధానంలో పర్యవేక్షించాలని మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News