ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:53 PM
బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో జరిగిన పాంచజన్య సంకల్ప సభలో కవిత పాల్గొని ప్రసంగించారు.
ఆదిలాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):: బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (శుక్రవారం) ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో జరిగిన పాంచజన్య సంకల్ప సభలో కవిత పాల్గొని ప్రసంగించారు. ఎల్లుండి ఆదిలాబాద్‌లో జరిగే బీఆర్ఎస్ గర్జనపై ఆమె హాట్ కామెంట్స్ చేశారు. అది గర్జన కాదని... తర్జన భర్జన అని ఎద్దేవా చేశారు. అది సిద్దిపేట బాబు- సిరిసిల్ల బాబు మధ్య జరుగుతున్న తర్జన భర్జన అని సెటైర్లు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ఎందుకు తెరిపించలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆ పరిశ్రమను ఎందుకు కాపాడలేక పోయారని నిలదీశారు. కాగజ్ నగర్ ప్రైవేట్ కాగితపు పరిశ్రమను తెరిపించిన కేటీఆర్.. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ రంగ పరిశ్రమను ఎందుకు పట్టించు కోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏ ముఖం పెట్టుకుని ఆదిలాబాద్‌లో రైతు గర్జన పెడుతున్నారో కేటీఆర్ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. చనాఖా- కొరాటా బ్యారేజీకి అదనంగా పెట్టిన రూ. 1700ల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని పట్టుబట్టారు. నాటి జిల్లా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న తిన్నారా..? లేకపోతే నాటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న వ్యక్తి జేబుల్లోకి వెళ్లాయో..? చెప్పాలని ప్రశ్నించారు. పరిశ్రమ మంత్రిగా దేశ విదేశాలు తిరిగిన కేటీఆర్... వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాలో టెక్స్‌టైల్స్ పార్క్‌ను ఎందుకు పెట్టలేదో చెప్పాలని సవాల్ చేశారు. తన ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాతనే.. కేటీఆర్ ఆదిలాబాద్ రైతు గర్జనకు రావాలని కవిత ఛాలెంజ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి భద్రత కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
కరవును చంద్రబాబు బాగా మేనేజ్ చేశారు.. కేటీఆర్ ప్రశంసలు
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News